గురుగ్రంథ్‌ సాహిబ్‌లో పేజీల చించివేత.. యువకుణ్ని కొట్టిచంపిన స్థానికులు

సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్‌ సాహిబ్‌లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది.

Published : 05 May 2024 04:24 IST

ఫిరోజ్‌పుర్‌: సిక్కుల పవిత్ర గ్రంథమైన గురుగ్రంథ్‌ సాహిబ్‌లోని కొన్ని పేజీలను చించివేయడంతో 19 ఏళ్ల ఓ యువకుడిని స్థానికులు కొట్టిచంపిన ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. స్థానిక తలీ గులామ్‌ గ్రామానికి చెందిన బక్షీశ్‌ సింగ్‌.. బందాలా గ్రామంలోని గురుద్వారా ప్రాంగణంలోకి శనివారం ప్రవేశించాడు. గురుగ్రంథ్‌ సాహిబ్‌లోని కొన్ని పేజీలను చించేశాడు. అనంతరం అక్కణ్నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే కొంతమంది స్థానికులు అతణ్ని బంధించారు. విషయం గ్రామమంతా పాకడంతో అనేక మంది గురుద్వారా వద్దకు చేరుకొని బక్షీశ్‌ను చితకబాదారు. తీవ్ర గాయాలపాలై అతడు మృతిచెందాడు. తన కుమారుడికి కొన్నేళ్లుగా మానసిక ఆరోగ్యం సరిగా లేదని, చికిత్స తీసుకుంటున్నాడని మృతుడి తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌ తెలిపారు. అతణ్ని కొట్టిచంపినవారిపై కేసు నమోదు చేయాలని కోరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని