Crime News: ఫేస్‌బుక్‌ పరిచయం.. కోరిక తీర్చాలని బెదిరింపు

ఆమె ఒక గృహిణి (32). ముగ్గురు పిల్లలతో ఆనందంగా సాగుతున్న సంసారం. ఏడాది క్రితం రామచంద్రాపురం బీడీఎల్‌ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి తల్లా అనూప్‌గౌడ్‌(26) ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఫోన్‌లో మాట్లాడుకునేవారు. గతేడాది అక్టోబరులో ఇద్దరూ కలుసుకున్నారు.

Updated : 18 Mar 2022 07:34 IST

 గృహిణిని లైంగికంగా వేధించిన నిందితుడి అరెస్ట్‌
రాచకొండ పరిధిలో 64 మందికి కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆమె ఒక గృహిణి (32). ముగ్గురు పిల్లలతో ఆనందంగా సాగుతున్న సంసారం. ఏడాది క్రితం రామచంద్రాపురం బీడీఎల్‌ కాలనీకి చెందిన ఐటీ ఉద్యోగి తల్లా అనూప్‌గౌడ్‌(26) ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఫోన్‌లో మాట్లాడుకునేవారు. గతేడాది అక్టోబరులో ఇద్దరూ కలుసుకున్నారు. అప్పుడు ఆమె గమనించకుండా అనూప్‌గౌడ్‌ ఆమె చరవాణిలో ఓ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి హ్యాక్‌ చేశాడు. ఫోన్‌లో ఉన్న వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించాడు. వాటిని అడ్డుపెట్టుకుని తనతో శారీరక సంబంధం పెట్టుకోమంటూ వేధించటం ప్రారంభించాడు. తన కోరిక తీర్చకపోతే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఆమె భర్త, స్నేహితులు, బంధువులకు పంపుతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. అసభ్య పదజాలంతో లైంగిక వేధింపులకు దిగాడు. ఫోన్‌ నంబర్‌ను బ్లాక్‌ చేసినా కొత్త నంబర్ల నుంచి ఫోన్‌చేసి వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో హయత్‌నగర్‌ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్టు సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలను వేధిస్తున్న 64 మంది ఆకతాయిలపై 6 వారాల వ్యవధిలో రాచకొండ షీ టీమ్‌ పోలీసులు 57 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 41 మంది మేజర్లు, 23 మంది మైనర్లున్నారు. గురువారం ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీసు కమిషనర్‌ క్యాంపు కార్యాలయంలో ఆకతాయిలకు భూమిక స్వచ్ఛంద సంస్థ సైకాలజిస్టు డాక్టర్‌ వాసవి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 136 మంది బాలికలను బాల్యవివాహాల నుంచి కాపాడగలిగామని సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని