కంటైనర్‌ మొబైల్‌ ఫోన్ల దోపిడీ ముఠా అరెస్ట్‌

చిత్తూరు జిల్లా నగరి వద్ద కంటైనర్‌లో మొబైల్‌ ఫోన్లు దోపిడీ చేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 30 Sep 2020 01:46 IST

మధ్యప్రదేశ్‌లో పట్టుకున్న చిత్తూరు పోలీసులు

నగరి: చిత్తూరు జిల్లా నగరి వద్ద కంటైనర్‌లో మొబైల్‌ ఫోన్లు దోపిడీ చేసిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌ జిల్లాలో దొంగల ముఠాలోని ముగ్గురిని పట్టుకున్నారు. నిందితులను అంతర్రాష్ట్ర కంజరభట్‌ బందిపోటు ముఠాగా పోలీసులు గుర్తించారు. 

గత నెలలో కంటైనర్‌ నుంచి రూ.7కోట్ల విలువైన మొబైల్‌ఫోన్లను దొంగలు దోచుకెళ్లారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన విచారణ చేపట్టిన పోలీసులు.. దొంగల ముఠా మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని అరెస్ట్‌ చేశారు. దోపిడీ చేసిన మొబైల్‌ ఫోన్లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ పర్యవేక్షణలో నెలకుపైగా కష్టపడి దొంగలను పట్టుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని