నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠా అరెస్టు

హైదరాబాద్‌లోని నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో పని మనుషులుగా చేరి వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి డబ్బు, బంగారంతో ..

Updated : 27 Oct 2020 06:28 IST

నాచారం: హైదరాబాద్‌లోని నాచారం చోరీ కేసులో నేపాలీ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇంట్లో పని మనుషులుగా చేరి వృద్ధురాలికి మత్తు మందు ఇచ్చి డబ్బు, బంగారంతో పరారైనట్లు రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ వెల్లడించారు. మొత్తం రూ.10 లక్షల నగదు, 19 తులాల బంగారం ఎత్తుకెళ్లారన్నారు. ఈ ముఠాలో ఐదుగురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు మాయ, రాజేశ్‌,హేమ్‌ ప్రసాద్‌, నిర్మల్‌, విస్మాసురాన్‌ను అరెస్టు  చేశామని, ప్రధాన నిందితుడు అర్జున్‌తోపాటు మరో ఇద్దర్ని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. నిందితుల నుంచి రూ.7 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. అర్జున్‌, మాయ భార్యాభర్తలుగా నమ్మించి పనిలో కుదిరినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు