ఎల్బీ నగర్‌ వంతెనపై రోడ్డు ప్రమాదం

ఎల్బీనగర్‌ వంతెనపై కారు రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్‌ సమీపంలో పతేనగర్‌కు చెందిన ఉదయ్‌రాజ్‌(18) తన బంధువు

Published : 18 Nov 2020 01:07 IST

 

నాగోల్‌: ఎల్బీనగర్‌ వంతెనపై కారు రెండు ద్విచక్రవాహనాలను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతిచెందగా, ముగ్గురు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. బాలానగర్‌ సమీపంలో పతేనగర్‌కు చెందిన ఉదయ్‌రాజ్‌(18) తన బంధువు అనూషకు డిగ్రీ పరీక్షలు ఉండడంతో ఆమెను పరీక్ష కేంద్రం వద్ద దించాడు. పరీక్ష అనంతరం సంఘీ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఆమెతో కలిసి ద్విచక్రవాహనంపై ఎల్బీనగర్‌ వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీనగర్‌ పైవంతెన చేరుకోగానే వెనుకనుంచి అతివేగంగా వచ్చిన ఓ స్విప్టుకారు వీరిని ఢీకొట్టింది. దీంతో ఉదయ్‌రాజ్‌ అమాంతం గాలిలోకి ఎగిరి 20 అడుగుల పైనుంచి కిందపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఆరెంజ్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. వెనుక కూర్చొన్న అనూషకు తీవ్రగాయాలు కాగా అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రమాదానికి కారణమైన కారు వీరి ముందున్న మరో ద్విచక్రవాహనాన్ని సైతం ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మెడిసిస్‌ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారుడ్రైవర్‌ను ఎల్బీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని