Hyderabad News: పోలీసులపై దుర్భాషలు.. మజ్లిస్‌ కార్పొరేటర్‌ అరెస్ట్

ఎంఐఎంకు చెందిన భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల పోలీసులపై కార్పొరేటర్‌ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆయన్ను

Updated : 06 Apr 2022 15:36 IST

హైదరాబాద్‌: ఎంఐఎంకు చెందిన భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ను ముషీరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల పోలీసులపై కార్పొరేటర్‌ దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఆయన్ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. 

అసలేం జరిగిందంటే..

సోమవారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు భోలక్‌పూర్‌ ప్రాంతానికి వెళ్లారు. రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణాలు మూసేయాలని స్థానిక దుకాణదారులకు సూచించారు. రంజాన్‌ సందర్భంగా దుకాణాలు తెరుచుకుంటున్నామంటూ కొంతమంది పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ పోలీసులపై దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ట్విటర్‌లో ఓ నెటిజన్‌ ఆ వీడియోను పోస్ట్‌ చేస్తూ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. పోలీసు విధులకు ఆటంకం కలిగించినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. రాష్ట్రంలో ఇలాంటి చర్యలను ఉపేక్షించవద్దని సూచించారు. ఈ నేపథ్యంలో పోలీసులు గౌసుద్దీన్‌ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని