అక్రమ మద్యం.. పట్టించిన గేదెలు

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు రైతుల్ని వారు పెంచుతున్న గేదెలే పట్టించిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. గుజరాత్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తే భారీ జరిమానాతోపాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. అందుకే ముగ్గురు నిందితులు మందు బాటిళ్లు ఎవరికీ కనిపించకుండా

Published : 09 Jul 2021 01:25 IST

అహ్మదాబాద్‌: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురు రైతుల్ని వారు పెంచుతున్న గేదెలే పట్టించిన ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలో అక్రమంగా మద్యం విక్రయిస్తే భారీ జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధిస్తారు. అందుకే ముగ్గురు నిందితులు మందు బాటిళ్లు ఎవరికీ కనిపించకుండా ఉండాలని పశువుల పాకలో గేదెలు నీళ్లు తాగే తొట్టిలో దాచిపెట్టారు. అయితే, ఇటీవల ఆ బాటిళ్లలో ఒకటి పగిలిపోవడంతో అందులో ఉండే మందు నీళ్లలో కలిసిపోయింది. అలా మందు కలిసిన నీటిని తాగిన గేదెలు వింతగా ప్రవర్తించడం, వాటి నోటి నుంచి నురుగ రావడం మొదలైంది. ఇది గమనించిన నిందితుల్లో ఒకరు పశువైద్యుడిని పిలిపించాడు. ఏం జరిగిందా అని వైద్యుడు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. దీంతో వైద్యుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.32వేలు విలువ చేసే 100 మందు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని