Casino: క్యాసినో బిజినెస్‌ చేస్తా.. అందులో తప్పేముంది?: చీకోటి ప్రవీణ్‌

తనపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో తన పేరుతో ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసి తప్పుడు ప్రచారం

Published : 05 Aug 2022 14:58 IST

హైదరాబాద్‌: తనపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో తన పేరుతో ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. నాలుగో రోజు ఈడీ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తనకు ప్రాణహాణి ఉందని.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశానని చెప్పారు. 

ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని.. ఇకపైనా వాటిని కొనసాగిస్తానని చీకోటి ప్రవీణ్‌ చెప్పారు. క్యాసినో బిజినెస్‌ చేస్తానని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. తనకు ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయన్నారు. ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని.. విచారణ పూర్తయిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని