కుక్కకు హీలియమ్‌ బెలూన్లు కట్టి.. గాల్లోకి..

తమదైన శైలిలో వీడియోలు చేసి వీక్షకులను ఆకట్టుకోవడానికి విభిన్నంగా ప్రయత్నిస్తుంటారు యూట్యూబర్స్‌. అయితే కొన్నిసార్లు అవి పేరు తెచ్చిపడితే.. ఒక్కోసారి వివాదాలకూ దారితీస్తాయి. తాజాగా దిల్లీకి చెందిన ఓ యూట్యూబర్‌ తన పెంపుడు కుక్కను గాలిలో ఎగిరించేందుకు దానికి హీలియమ్‌ బెలూన్స్‌ కట్టి, దాన్ని చీత్రికరించి యూట్యుబ్‌లో పెట్టి, కటకటాలపాలయ్యాడు.

Published : 28 May 2021 01:41 IST

ఓ యూట్యూబర్‌ నిర్వాకం

దిల్లీ: విభిన్న వీడియోలు తీసి వీక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు యూట్యూబర్స్‌. అయితే కొన్నిసార్లు అవి పేరు తెచ్చిపడితే.. ఒక్కోసారి వివాదాలకూ దారితీస్తాయి. తాజాగా దిల్లీకి చెందిన ఓ యూట్యూబర్‌ తన పెంపుడు కుక్కను గాలిలో ఎగిరించేందుకు దానికి హీలియమ్‌ బెలూన్స్‌ కట్టి, చీత్రికరించి యూట్యుబ్‌లో పెట్టి, కటకటాలపాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. అతడి పేరు గౌరవ్‌. ‘గౌరవ్‌జోన్‌’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌కు 40 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఈ నేపథ్యంలో గౌరవ్‌ తాజాగా పెంపుడు కుక్క డాలర్‌కు హీలియమ్‌ బెలూన్స్‌ను, కట్టి గాలిలో ఎగురవేశాడు. కుక్క శరీరం ముందు భాగం ఎగరడం మొదలయ్యాక, బెలూన్ల స్ర్టింగ్‌ను పైకి లాగి కుక్కను మరింత పైకి ఎత్తాడు. ఈ క్రమంలో డాలర్‌ రన్‌ అని చెప్పగా.. అది గాలిలోకి సైతం ఎగిరింది. ఇంకా పైకి ఎగరాలనే ఉద్దేశంతో మరిన్ని బెలూన్లను సైతం కట్టాడు. మరో దృశ్యంలో.. ఓజీపు మీదకు ఎక్కిన గౌరవ్‌ దానిమీద కూర్చొని గాలిలో బెలూన్లు కట్టిన తన కుక్కను ఎగురవేశాడు. ఈ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగా, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెంటనే ఆ వీడియోను తొలగించాడు.

వీక్షకుల ఆనందం కోసం ఇలా మూగజీవాలను ఇబ్బందులకు గురి చేసిన గౌరవ్‌పైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు దక్షిణ దిల్లీలోని మాల్వియా నగర్‌ పోలీసులు. ఇదిలా ఉండగా తాను చేసిన ఈ పనికి క్షమాపణలు కోరుతూ మరో వీడియోను విడుదల చేశాడు గౌరవ్‌. అందులో తన పాత వీడియో ఎందుకు డిలీట్‌ చేయాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. ‘‘కుక్కను గాలిలో ఎగురవేసే ముందు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొనే వీడియో తీశాం. మేము తీసుకున్న జాగ్రత్తలను సైతం వీడియోలో పెడదామనుకున్నాం.. అప్పటికే వీడియో నిడివి ఎక్కువ కావడంతో దాన్ని అప్‌లోడ్‌ చేయలేదు. ఇదంతా నా తప్పే. జాగ్రత్తలు తీసుకున్నా, ప్రజలకు తప్పుడు సందేశమే వెళ్లింది. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. నా వీక్షకులకు, పెట్‌ లవర్స్‌కి క్షమాపణలు చెబుతున్నా. ఇకపై ఇలాంటి వీడియోలు ప్రయత్నించను. ఇలాంటివి చూసి ప్రభావితం కాకండి’’ అంటూ క్షమాపణలు కోరాడు గౌరవ్‌.


Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని