AP News: ‘అదృశ్యం కాదది... హత్యోన్మాదమే?’

మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన కుల్లు రామసుబ్బయ్య (38) అదృశ్యం కేసు వివిధ మలుపులు తిరిగి చివరకు హత్యోన్మాదమేనన్న పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చుతోంది. పోట్లదుర్తికి చెందిన కుల్లు చిన్నఎల్లాలు కుమారుడు రామసుబ్బయ్య జమ్మలమడుగు పాలిటెక్నిక్‌ కళాశాలలో అటెండరుగా పనిచేస్తుండేవాడు.

Updated : 04 Aug 2021 08:18 IST

కుల్లు రామసుబ్బయ్య (దాచిన చిత్రం)

ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: కడప జిల్లా ఎర్రగుంట్ల పరిధిలోని పోట్లదుర్తి గ్రామానికి చెందిన కుల్లు రామసుబ్బయ్య (38) అదృశ్యం కేసు వివిధ మలుపులు తిరిగి చివరకు హత్యోన్మాదమేనన్న పోలీసుల అనుమానాలకు బలం చేకూర్చుతోంది. పోట్లదుర్తికి చెందిన కుల్లు చిన్నఎల్లాలు కుమారుడు రామసుబ్బయ్య జమ్మలమడుగు పాలిటెక్నిక్‌ కళాశాలలో అటెండరుగా పనిచేస్తుండేవాడు. గత నెల 24వ తేదీన కళాశాలకు విధులకు హాజరయ్యేందుకు వెళ్లిన రామసుబ్బయ్య తిరిగి ఇంటికి రాలేదు. అనంతరం పలు ప్రాంతాల్లో విచారించ 28న అతని భార్య వసంత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అతనికి సన్నిహితంగా ఉన్న ప్రొద్దుటూరువాసులు ఇద్దరు, చిలమకూరు ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్థిక లాభాదేవీల కారణంగా రామసుబ్బయ్యను చంపి అన్నవరం వద్ద అతని ద్విచక్ర వాహనంతో సహా కుందు నదీలో వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎర్రగుంట్ల ఎస్‌ఐలు కృష్ణయ్య, ప్రవీణ్‌కుమార్, చాపాడు ఎస్‌ఐ సుబ్బారావుతో కలిసి మంగళవారం కుందునదీ వద్ద అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. కుల్లు రామసుబ్బయ్య, వసంత దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు