Red Sandal: ఈ స్మగ్లర్‌ మరో ‘పుష్ప’.. ఎన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసినా..

ఎన్ని తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేసినా ‘పుష్ప’ సినిమాలో మాదిరి ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్‌ను కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు ..

Updated : 02 Feb 2022 08:33 IST

బెళగావి: ఎన్ని తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేసినా ‘పుష్ప’ సినిమాలో మాదిరి ఎర్రచందనం రవాణా చేస్తున్న స్మగ్లర్‌ను కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు సయ్యద్‌ యాసిన్‌ను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ.2.45 కోట్లని అంచనా. వీటిని తరలించేందుకు వినియోగించిన లారీ విలువ రూ.పది లక్షలని తెలిపారు. బెంగళూరు సమీపంలోని ఆనేకల్‌ ప్రాంతానికి చెందిన నిందితుడు తన వాహనంలో కరోనా బాధితులకు పండ్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులను నమ్మించాడు. ఆ మేరకు లారీ ముందుభాగంలో పెద్ద అక్షరాలతోనూ రాయించాడు. వాహనంలోని దుంగలను ఏపీలో ఓ గుర్తుతెలియని ప్రాంతం నుంచి తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఆంధ్ర, కర్ణాటక పోలీసులను నమ్మించి వెళుతున్న అతడిని మహారాష్ట్రలోని గాంధీచౌక్‌ ప్రాంతంలో పోలీసులు సోమవారం సాయంత్రం అడ్డుకున్నారు. అతడి వెనకనున్న ముఠా గురించి ఆరా తీస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని