రోడ్డు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థి మృతి

బండిఆత్మకూరు మండలంలోని పార్నపల్లె గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల పట్టణానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి ఎల్లావత్తుల కమాల్‌బాషా (18) మృతి చెందాడు.

Updated : 29 Nov 2022 04:39 IST

మరణించిన కమాల్‌బాషా

పార్నపల్లె (బండిఆత్మకూరు), న్యూస్‌టుడే : బండిఆత్మకూరు మండలంలోని పార్నపల్లె గ్రామ శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల పట్టణానికి చెందిన ఇంటర్‌ విద్యార్థి ఎల్లావత్తుల కమాల్‌బాషా (18) మృతి చెందాడు. నంద్యాల పట్టణానికి చెందిన కరీంబాషా కుమారుడైన కమాల్‌బాషా విజయవాడలోని చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల నంద్యాలకు వచ్చిన ఈ విద్యార్థి సోమవారం తన స్నేహితుడు వినోద్‌తో కలిసి మరో స్నేహితుడిని వెలుగోడులో వదిలేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కమాల్‌బాషా, వినోద్‌ కలిసి ద్విచక్రవాహనంపై వెలుగోడు నుంచి నంద్యాలకు బయలుదేరారు. పార్నపల్లె సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. విద్యార్థులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 వాహనంలో నంద్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కమాల్‌బాషా మృతి చెందాడు. తండ్రి కరీంబాషా ఫిర్యాదు మేరకు లారీ చోదకుడు రాఘవేంద్రారెడ్డిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఏఎస్సై అక్బర్‌బాషా తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని