లారీతో తొక్కించి.. తండ్రిని హతమార్చి

కన్నతండ్రినే లారీతో తొక్కించి హతమార్చాడొక కొడుకు. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాజుపాళెం వద్ద బుధవారం జరిగింది.

Published : 02 Feb 2023 07:28 IST

మర్రిపాడు, న్యూస్‌టుడే: కన్నతండ్రినే లారీతో తొక్కించి హతమార్చాడొక కొడుకు. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం రాజుపాళెం వద్ద బుధవారం జరిగింది. కడప జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడుకు చెందిన మహబూబ్‌ బాషా (52), షఫీ తండ్రీకొడుకులు. వీరు తాడిపత్రి నుంచి సిమెంటు లోడుతో లారీలో నెల్లూరుకు బయలుదేరారు. వీరితోపాటు మరో డ్రైవర్‌ ఓబయ్య ఉన్నాడు. కుటుంబ కలహాలతో తండ్రీకొడుకులు గొడవ పడుతుండగా విసుగెత్తిపోయిన ఓబయ్య రాజుపాళెం వద్ద లారీని ఆపేసి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వారి మధ్య వివాదం మరింత ముదిరింది. షఫీ లారీ ఎక్కి ముందుకు కదిలించబోతుండగా తండ్రి బాషా అడ్డుగా నిల్చున్నాడు. కోపంతో ఉన్న షఫీ లారీతో అతడిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని