పిడుగుపాటుకు రైతు మృతి

మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం చిన్నఎల్లాపురం శివారు హాముతండ సమీపంలో శనివారం రాత్రి పిడుగుపాటుకు ఒకరు బలయ్యారు.

Published : 20 Mar 2023 04:08 IST

కొత్తగూడ(మహబూబాబాద్‌), న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం చిన్నఎల్లాపురం శివారు హాముతండ సమీపంలో శనివారం రాత్రి పిడుగుపాటుకు ఒకరు బలయ్యారు. చిన్నఎల్లాపురానికి చెందిన రైతు ధరంసోతు శంకర్‌(45), చెరువుకొమ్ముతండాకు చెందిన మరోరైతు జర్పుల కీర్య తమ మొక్కజొన్న పంటను అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు శనివారం రాత్రి కాపలాకు వెళ్లారు. అర్ధరాత్రి దాటాక వడగళ్ల వాన రావడంతో సమీపంలో ఓ రైతు నిర్మించిన గదిలోకి తలదాచుకునేందుకు వెళ్లారు. ఒక్కసారిగా పక్కనున్న చెట్టుపై పిడుగుపడింది. చెట్టు కూలి వీరు తలదాచుకున్న గదిపై పడి గోడ కూలింది. ఈ ప్రమాదంలో శంకర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, కీర్య రెండు కాళ్లు విరిగాయి. క్షతగాత్రుడిని వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సతీష్‌ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని