శరత్‌ చంద్రారెడ్డికి మధ్యంతర బెయిల్‌

అరబిందో డైరెక్టర్‌ పెనక శరత్‌ చంద్రారెడ్డికి దిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 02 Apr 2023 04:09 IST

ఈనాడు, దిల్లీ: అరబిందో డైరెక్టర్‌ పెనక శరత్‌ చంద్రారెడ్డికి దిల్లీ రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నాలుగు వారాల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. దిల్లీ మద్యం కేసులో నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయనను ఈడీ అరెస్టు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం తిహాడ్‌ జైలులో ఉన్న శరత్‌చంద్రారెడ్డి తన భార్య అనారోగ్యం దృష్ట్యా పక్కన ఉండి ఆమెను చూసుకోవాలని, అందుకు 6 వారాలు బెయిల్‌ మంజూరు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ శనివారం దీనిపై విచారణ చేపట్టారు. అనంతరం శరత్‌చంద్రారెడ్డికి 4వారాలుమధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. తీర్పునకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువడాలి. తన నాయనమ్మ అంత్యక్రియల నిమిత్తం బెయిల్‌ కోరుతూ శరత్‌చంద్రారెడ్డి జనవరి ఆఖరి వారంలో పిటిషన్‌ దాఖలుచేయగా నాడు ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు 14 రోజుల మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు