ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ముగ్గురి అరెస్టు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సిట్‌ పోలీసులు తాజాగా మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు.

Published : 26 May 2023 04:36 IST

ఈనాడు, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సిట్‌ పోలీసులు తాజాగా మరో ముగ్గుర్ని అరెస్టు చేశారు. దీంతో నిందితుల సంఖ్య 43కు చేరింది. ఈ కేసులో బుధవారం అరెస్టయిన పూల రవికిశోర్‌ నుంచి ఈ ముగ్గురు అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ప్రశ్నపత్రం కొన్నట్లు నిర్ధారించుకున్న పోలీసులు.. వారిని గురువారం అరెస్టు చేశారు. ఉప్పల్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి భరత్‌ నాయక్‌కు ఏఈఈ ప్రశ్నపత్రం ఇచ్చేందుకు రవికిశోర్‌ రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని.. రూ.లక్ష తీసుకున్నాడు. వరంగల్‌కు చెందిన పసికంటి రోహిత్‌కుమార్‌, గాదె సాయి మధులకూ ప్రశ్నపత్రం ఇచ్చినట్లు నిర్ధారణైంది. వీరి నుంచి ఎంత సొమ్ము తీసుకున్నాడనేది తేలాల్సి ఉంది. రవికిశోర్‌ తన చేతికి ప్రశ్నపత్రం అందగానే పదుల సంఖ్యలో అభ్యర్థులకు విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు ఆరా తీస్తున్న క్రమంలో భరత్‌నాయక్‌, రోహిత్‌కుమార్‌, సాయి మధుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇంకా నిందితులు ఎవరెవరు ఉన్నారో దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని అరెస్టులుంటాయని ఓ అధికారి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని