Cyber Crime: ఉచిత థాలీ ఎరలో దిల్లీ మహిళ.. సైబర్‌ మోసానికి గురైన బ్యాంకు ఉద్యోగి

‘‘ఒక థాలీ (భోజనం ప్లేటు) కొంటే.. మరో థాలీ ఉచితం. మా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి’’ అనే ప్రకటన వలలో పడి నైరుతి దిల్లీ ప్రాంతానికి చెందిన సవితాశర్మ (40) అనే మహిళ రూ.90 వేలు పోగొట్టుకున్నారు.

Updated : 28 May 2023 09:05 IST

దిల్లీ: ‘‘ఒక థాలీ (భోజనం ప్లేటు) కొంటే.. మరో థాలీ ఉచితం. మా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి’’ అనే ప్రకటన వలలో పడి నైరుతి దిల్లీ ప్రాంతానికి చెందిన సవితాశర్మ (40) అనే మహిళ రూ.90 వేలు పోగొట్టుకున్నారు. ఓ బ్యాంకులో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సవిత.. ఫేస్‌బుక్‌లో ఉన్న ఈ ఆఫర్‌ గురించి తమ బంధువు ఒకరు చెప్పడంతో ప్రయత్నం చేసినట్లు తెలిపారు.

‘‘సైట్‌లోకి వెళ్లి ఇచ్చిన నంబరుకు కాల్‌ చేశాను. వెంటనే బదులు రాలేదు. ఆ తర్వాత మళ్లీ నాకు ఫోను చేసి ‘‘సాగర్‌ రత్న’’ (ప్రముఖ చైన్‌ రెస్టారెంటు) ఆఫర్‌ గురించి కాలర్‌ చెప్పాడు. ఓ లింక్‌ పంపి, డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నాడు. యాప్‌కు సంబంధించిన యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ పంపాడు. ఆఫర్‌ ఉపయోగించుకోవాలంటే ముందుగా యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలన్నాడు. అన్నీ చెప్పినట్టే చేశా. ఆ సమయంలో ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు. ఆ తర్వాత నా ఖాతా నుంచి రూ.40 వేలు, రూ.50 వేలు డ్రా చేసినట్లు సందేశాలు వచ్చాయి. ఆ డబ్బు నా క్రెడిట్‌కార్డు నుంచి నా పేటీఎం ఖాతాకు వెళ్లి.. మోసగాడి ఖాతాకు చేరడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వివరాలేవీ నేను కాలర్‌కు చెప్పలేదు. వెంటనే నా క్రెడిట్‌కార్డు బ్లాక్‌ చేయించాను’’ అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని