Viral Video: కదిలే జీపు బానెట్‌పై వేడుకలు.. యువతిపై పోలీస్‌ కేసు

సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం నేటి యువత కొందరు దుస్సాహసాలు చేస్తూ కోరి కష్టాలు  తెచ్చుకొంటున్నారు.

Updated : 05 Aug 2023 09:51 IST

సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు కోసం నేటి యువత కొందరు దుస్సాహసాలు చేస్తూ కోరి కష్టాలు  తెచ్చుకొంటున్నారు. పంజాబ్‌లోని హోషియాపుర్‌ సమీప దాసుయాకు చెందిన గౌరీ విర్ది (25) అనే యువతి ఇలాగే పోలీసు కేసులో చిక్కుకొంది. ఈమె ఇన్‌స్టాగ్రాం ఖాతాకు మిలియన్‌ (10 లక్షలు) ఫాలోవర్స్‌ రావడంతో ఆ ఆనందంలో కదులుతున్న వాహనంపై ఊరేగింది. జలంధర్‌ - జమ్మూ జాతీయ రహదారిపై ‘1 మిలియన్‌’ బెలూన్‌ చూపుతూ బానెట్‌పై నృత్యం చేసింది. ఈ వీడియో వైరల్‌ కాగానే పోలీసులు రంగంలోకి దిగి ఆమెపై కేసు నమోదు చేశారు. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించినందుకు చలాన్‌ కూడా విధించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని