బాలికపై సీఐ అత్యాచారం.. పోక్సో చట్టం కింద కేసుల నమోదు

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

Published : 23 Mar 2024 05:09 IST

భీమారం, న్యూస్‌టుడే: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో అతనిపై హనుమకొండ జిల్లా కేయూ పోలీసుస్టేషన్‌లో శుక్రవారం అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ఎస్సై రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం భూపాలపల్లి వీఆర్‌ సీఐగా పని చేస్తున్న బండారి సంపత్‌ 2022లో కాకతీయ యూనివర్సిటీ పోలీసుస్టేషన్‌లో ఎస్సైగా పని చేశాడు. ఆ సమయంలో హనుమకొండలోని ఓ కాలనీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడి సన్నిహితంగా మెలిగేవాడు. అనంతరం ఖమ్మం జిల్లాకు సీఐగా బదిలీ అయినా ఆమెతో స్నేహాన్ని కొనసాగించాడు. ఇటీవల జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో వీఆర్‌ సీఐగా బదిలీపై వచ్చాడు. ఈ క్రమంలో గత కొద్దిరోజులుగా సదరు మహిళ కూతురి(16)పై కన్నేశాడు. అదను చూసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె కేయూ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితురాలి ఇంటికి వెళ్లి విచారణ జరిపిన పోలీసులు.. సీఐ సంపత్‌పై అత్యాచారంతోపాటు పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని