Bihar: కల్తీ మద్యానికి 16 ప్రాణాలు బలి!

బిహార్‌లోని పశ్చిమచంపారన్‌లో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బెతియా పట్టణంలోని పలు గ్రామాల్లో 4 రోజుల వ్యవధిలో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది....

Published : 18 Jul 2021 01:26 IST

పాట్నా: బిహార్‌లోని పశ్చిమచంపారన్‌లో అనుమానాస్పద మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బెతియాలోని పలు గ్రామాల్లో 4 రోజుల వ్యవధిలో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. కల్తీ మద్యం కారణంగానే వారంతా మృతిచెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. తాజాగా మరో వ్యక్తి ఆసుపత్రి పాలుకావడంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం బాధిత గ్రామంలో పరిస్థితిని సమీక్షిస్తోంది. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని ప్రశ్నిస్తున్నారు. 

జోగియా, ద్యురావా, బగాహి గ్రామాల్లో శుక్రవారం ఒక్కరోజే ఎనిమిది మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు మరో ఎనిమిది మంది మరణించారు. ‘గత రెండు, మూడు రోజుల్లో అనుమానాస్పద స్థితిలో పలువురు మృతిచెందినట్లు మాకు సమాచారం అందింది. మృతులు మద్యం సేవించలేదని వారి కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నాం’ అని జిల్లా కలెక్టర్‌ కుందన్‌ కుమార్‌ వెల్లడించారు. బాధిత గ్రామాల్లో ఇంకెవరైనా అస్వస్థతకు గురైతే వారికి చికిత్స అందించేందుకు ఓ మెడికల్‌ బృందం  పర్యటిస్తోందని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని