శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి

కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కనీసం ఎనిమిది మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్​తెలిపారు. మైనింగ్ కోసం ఏర్పాటు చేసిన ఓ ట్రక్కులో పేలుడు పదార్థాలు.........

Updated : 22 Jan 2021 11:17 IST

శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గ ప్రాంతంలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్ కె.బి.శివకుమార్‌ ​తెలిపారు. మైనింగ్ కోసం ఉపయోగించే పేలుడు పదార్థాలు ఓ ట్రక్కులో తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ పేలినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతులంతా బిహార్‌కు చెందిన కార్మికులుగా గుర్తించారు.

 

గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన శివమొగ్గతో పాటు పొరుగున ఉన్న దావణగెరె, చిక్‌మగళూరు జిల్లాల్లోనూ కలకలం రేపింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి పలు ఇళ్లలో కిటికీలు ధ్వంసమవ్వగా, రోడ్లకు బీటలు వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే తొలుత అందరూ భూకంపంగా భావించారు. తర్వాత పేలుడు జరిగిందని నిర్థరణకు వచ్చారు. ఘటనాస్థలంలో పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు గుర్తుపట్టలేని రీతిలో ఛిద్రమైపోయాయని సమాచారం. మృతుల శరీర భాగాలు దాదాపు 1.5 కి.మీ వరకు చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావాల్సిన సహకారం అందిస్తోందని తెలిపారు.

ఇవీ చదవండి...

బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు: 28 మంది మృతి

నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని