Crime News: లైంగిక వాంఛ తీర్చాలని అర్ధరాత్రి వేధింపులు.. కత్తితో పొడిచి చంపిన యువతి
ములుగు జిల్లా ఏటూరునాగారం మూడో వార్డులో దారుణం జరిగింది. వేధిస్తున్నాడనే కారణంతో యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపేసింది.
ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మూడో వార్డులో దారుణం జరిగింది. వేధిస్తున్నాడనే కారణంతో యువకుడిని ఓ యువతి కత్తితో పొడిచి చంపేసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జాడి సంగీత అనే యువతి ఏటూరు నాగారం మూడో వార్డు ఎర్రెళ్లవాడలో తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటోంది. ఆమెకు తల్లిదండ్రులు, తోబుట్టువులు లేకపోవడంతో వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది.
ఏటూరు నాగారానికే చెందిన రాంటెంకి శ్రీనివాస్ (25)కు ఇది వరకే వివాహమైంది. అయితే భార్య, పిల్లలు వదిలేసి వెళ్లిపోవడంతో శ్రీనివాస్ ఒంటరిగా ఉంటున్నాడు. మద్యం తాగి రాత్రి వేళ తరచూ సంగీత ఇంటికి వెళ్లి తలుపులు కొడుతూ ఆమెను వేధించేవాడు. లైంగిక వాంఛ తీర్చాలంటూ పలుమార్లు సంగీతను బలవంతం చేశాడు. దీనిపై కొన్ని నెలల క్రితం ఏటూరు నాగారం పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీనివాస్.. సంగీతను మరింత ఎక్కువగా వేధించసాగాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మద్యం తాగి సంగీత ఇంటికి వెళ్లి బలవంతం చేశాడు. తరచూ ఇలా జరుగుతుండటంతో కోపోద్రిక్తురాలైన సంగీత.. శ్రీనివాస్ చేతులు కట్టేసి కత్తితో పొడిచి హతమార్చింది. అనంతరం రాత్రి 2 గంటల తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏటూరు నాగారం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై డి.రమేశ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.