Crime news: ఐదుగురు కుటుంబీకులను హత్యచేసి.. ఆపై ఇంటికి నిప్పంటించి!

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో సామూహిక హత్యాకాండ ఘటన వెలుగుచూసింది. ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతం ఖేర్వాజ్‌పుర్‌ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.......

Published : 24 Apr 2022 01:32 IST

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో సామూహిక హత్యాకాండ ఘటన వెలుగుచూసింది. ప్రయాగ్‌రాజ్‌ ప్రాంతం ఖేర్వాజ్‌పుర్‌ గ్రామంలోని ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లోకి చొరబడిన దుండగులు రాళ్లు, ఇటుకలతో కుటుంబీకులను హత్యచేసినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా వారి ఇంటికి నిప్పంటించారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది.

గారాపూర్ నుంచి సికంద్రా వెళ్లే రోడ్డు పక్కన ఖేర్వాజ్‌పుర్‌ గ్రామంలో రాజ్‌కుమార్ యాదవ్(55) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే ఈ తెల్లవారుజామున వారింట్లోకి ప్రవేశించిన దుండగులు రాజ్‌కుమార్ యాదవ్‌తోపాటు ఆయన భార్య కుసుమ్ దేవి(53), దివ్యాంగురాలైన కుమార్తె మనీషా కుమారి(25) కోడలు సవిత(23), మనవరాలు సాక్షి(2)ని దారుణంగా హతమార్చారు. ఇంటికి నిప్పంటించగా పొగలు రావడంతో గమనించిన గ్రామస్థులు పోలీసులుకు సమాచారం అందించారు.

అగ్నిమాపక బృందం, పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేశారు. మృతులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. హత్యకు ముందు హత్యాచారం జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ హత్యలను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకే ఇంటికి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణ కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే పట్టుకుని శిక్షిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని