Basar RGUKT: బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య

బాసర అర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వర్సిటీలో పీయూసీ-1 చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ బాయ్స్‌ హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Updated : 08 Aug 2023 18:20 IST

నిర్మల్: బాసర అర్జీయూకేటీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వర్సిటీలో పీయూసీ-1 చదువుతున్న విద్యార్థి జాదవ్ బబ్లూ బాయ్స్‌ హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వర్సిటీ సిబ్బంది విద్యార్థి మృతదేహాన్ని నిర్మల్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు వర్సిటీ అధికారులు చెబుతున్నట్లు సమాచారం. విద్యార్థిది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌. ఈ మేరకు విద్యార్థి కుటుంబసభ్యులకు వర్సిటీ అధికారులు సమాచారం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు