Viveka Murder case: ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. కడప సబ్‌కోర్టులో ఇటీవల సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతూ పిటిషన్...

Published : 17 Nov 2021 01:19 IST

కడప: కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వై.ఎస్‌. వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై విచారణ ఈనెల 19కి వాయిదా పడింది. కడప సబ్‌కోర్టులో ఇటీవల సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై మంగళవారం సబ్‌కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుడి తరఫు న్యాయవాది కౌంటర్‌ దాఖలు చేయడానికి న్యాయస్థానం అవకాశం కల్పిస్తూ ఈనెల 19కి విచారణ వాయిదా వేసింది. వివేకా హత్యకేసులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలను నిందితులుగా చేరుస్తూ సీబీఐ గత నెల 26న పులివెందుల కోర్టులో ప్రలిమినరీ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని