Road Accident: రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె మండల పరిధిలోని చిన్నఓరంపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

Updated : 16 Jul 2023 08:00 IST

ఓబులవారిపల్లె: అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఓబులవారిపల్లె మండల పరిధిలోని చిన్నఓరంపాడు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.  

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కటికంవారిపల్లె గ్రామానికి చెందిన 20 మంది టాటాఏస్‌, టాటాసుమో వాహనాల్లో మదనపల్లె వద్ద ఉన్న బోయకొండ గంగమ్మ ఆలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో చిన్నఓరంపాడు వద్ద జాతీయ రహదారిపై టాటాఏస్‌ వాహనం ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను.. అదుపు తప్పి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలోని ఎన్నారి నరసింహులు (57) తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. శంకరమ్మ (50)ను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలో మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని