Dastagiri: అట్రాసిటీ కేసులో వివేక హత్య కేసు అప్రూవర్‌ దస్తగిరికి బెయిల్‌

ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్‌ డ్రైవర్‌ దస్తగిరికి కడప జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 19 Feb 2024 17:47 IST

కడప: ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు అప్రూవర్‌ డ్రైవర్‌ దస్తగిరికి కడప జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గతేడాది నవంబరులో అతణ్ని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అప్పట్నుంచి కడప జిల్లా కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. గతంలో ఎర్రగుంట్ల పోలీసులు పెట్టిన కేసులో రెండు వారాల కిందట ఏపీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయగా, తాజాగా వేముల పోలీసులు పెట్టిన దాడి కేసులో కడప జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. అతనిపై నమోదైన రెండు కేసుల్లో బెయిల్‌ రావడంతో రేపు సాయంత్రం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని