logo
Published : 02/12/2021 03:08 IST

అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త

వినుకొండ, న్యూస్‌టుడే: సొంత మరదల్ని రెండో పెళ్లి చేసుకున్న ప్రబుద్ధుడు అనుమానంతో బుధవారం ఆమె గొంతు కోసిన ఉందంతమిది. ఏఎస్‌ఐ సాంబయ్య కథనం ప్రకారం.. వెన్నపూస కాలనీకి చెందిన తిరుమల పెదవెంకయ్యకు ఆరుగురు ఆడ సంతానంలో నాలుగోకుమార్తె కరుణను చిలకలూరిపేటకు చెందిన వెంకయ్యకు ఇచ్చి పెళ్లి చేయగా ఒక బిడ్డ పుట్టిన తర్వాత నాలుగేళ్ల క్రితం చనిపోవడంతో పుట్టింటికొచ్చి ఉంటుంది. రెండో కుమార్తె కృపకు అనారోగ్యంగా ఉందని ఆమె భర్త నల్లబోతుల శ్రీనుతో ఎనిమిది నెలల క్రితం కరుణకు రెండో పెళ్లి చేశారు. కొద్దిరోజులు గడవగానే అనుమానంతో అక్క, భర్త తరచూ తనతో గొడవ పడేవారని ఆమె వాపోయారు. అది భరించలేక తిరిగి సమీపంలో ఉంటున్న తండ్రి వద్దకు వచ్చింది. బుధవారం మధ్యాహ్నం ఇంటి కొచ్చిన శ్రీను కరుణ గొంతు కోయడంతో ఆమె కేకలు వేసింది. తండ్రి పెదవెంకయ్య పరుగున రాగా నిందితుడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఎస్సై రాజ్యలక్ష్మి కేసు నమోదు చేశారు.

Read latest 4 News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని