logo

అసౌకర్యాలు గుర్తించి.. దూరాభారం తగ్గించి

పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Published : 20 Apr 2024 02:31 IST

జిల్లాలో 13 చోట్ల పోలింగ్‌ కేంద్రాల మార్పు

మంచిర్యాల పట్టణం, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అధికారులు పోలింగ్‌ కేంద్రాలు సిద్ధం చేశారు. పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,850 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల ఇబ్బందులను గుర్తించిన జిల్లా అధికారులు అక్కడక్కడ శిథిలావస్థకు చేరిన భవనాలు, అనుకూలంగా లేని పోలింగ్‌ కేంద్రాలను మార్చారు. విద్యుత్తు, తాగునీరు, మరుగు దొడ్లు లాంటి వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్‌ కేంద్రం ఓటర్లకు రెండు కి.మీ. పరిధిలో ఉండేెలా చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు, ఇప్పటికీ కేంద్రాల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. సరైన వసతులు లేని వాటిని సహాయ ఎన్నికల అధికారులు పరిశీలించి జిల్లాలో 13 చోట్ల మార్పు చేశారు. మరో 36 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన పాఠశాలలు అప్‌గ్రేడ్‌ కావడంతో వాటి పేర్లు మార్పు చేశారు.

తాండూరు మండలంకొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. ఓటర్లకు దూరంగా ఉండటంతో దాదాపు మూడు కి.మీ. వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన పరిస్థితి. అందుకే ఓటర్లకు అందుబాటులో ఉండేలా రాజీవ్‌నగర్‌లోని గ్రామ పంచాయతీ భవనంలోకి పోలింగ్‌ కేంద్రాన్ని మార్చారు.

కిష్టంపేట పోలింగ్‌ కేంద్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉంటే మూడు కి.మీ. దూరంలోని తాండురు గ్రామపంచాయతీ కార్యాలయంలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తుంది. దూరాభారం కావడంతో అక్కడ పోలింగ్‌ శాతం తగ్గుతోంది. అందుకే ఆ పోలింగ్‌ కేంద్రాన్ని కిష్టంపేటలోని ప్రైవేట్‌ పాఠశాల భవనంలోకి మార్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు