logo

సమస్యలపై ఆశా కార్యకర్తల నిరసన

లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశ, సీహెచ్‌డబ్ల్యూలకు పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణకు సంబంధించి చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే అందించాలని సీఐటీయూ నాయకుడు పాంగి ధనుంజై డిమాండ్‌ చేశారు.

Published : 05 Oct 2022 02:47 IST

లంబసింగి పీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేస్తున్న
ఆశ కార్యకర్తలు, సీఐటీయూ నాయకుడు ధనుంజై

చింతపల్లి, న్యూస్‌టుడే: లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆశ, సీహెచ్‌డబ్ల్యూలకు పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణకు సంబంధించి చెల్లించాల్సిన సొమ్మును తక్షణమే అందించాలని సీఐటీయూ నాయకుడు పాంగి ధనుంజై డిమాండ్‌ చేశారు. మంగళవారం లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు, సీహెచ్‌డబ్ల్యూలతోకలసి ఆయన పీహెచ్‌సీ ఎదుట ఆందోళన చేపట్టారు. తాము రెండేళ్ల నుంచి పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొంటున్నా దీనికి సంబంధించిన ప్రోత్సాహక నిధులు ఇప్పటివరకూ రాలేదని వారు ఆవేదన చెందారు. యూనియన్‌ నాయకులు లక్ష్మి, భానుమతి, సుభద్ర, తులసి తదితరులు పాల్గొన్నారు.

పాడేరు, న్యూస్‌టుడే: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ పాడేరు మండలం మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. మంగళవారం నిర్వహించాల్సిన ఆశా డేను బహిష్కరించారు. సీఐటీయూ మండల నాయకులు సుందరరావు ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓ గర్భిణి మృతికి ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తను బాధ్యులు చేయడం సరికాదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని