logo

యువత చేతిలోనే దేశ భవిష్యత్తు

దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువజనోత్సవాలను ప్రారంభించారు.

Published : 26 Nov 2022 02:26 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువజనోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సన్మార్గం వైపు అడుగులేయాలని చెప్పారు. సెల్‌ ఫోన్లతో గడిపి కాలాన్ని వృథా చేయవద్దని సూచించారు. కష్టపడి కాదు ఇష్టపడి చదవండి అంటూ హితబోధ చేశారు. జయాపజయాల కంటే పోటీల్లో భాగస్వామ్యం ముఖ్యమని చెప్పారు. ఎంపీపీ రత్నకుమారి మాట్లాడుతూ చదువు అజ్ఞానపు చీకట్లను తొలగించి విజ్ఞానపు వెలుగులు నింపుతుందన్నారు. విద్యాభివృద్థికి ప్రభుత్వం అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సెట్విస్‌ సీఈఓ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ చిట్టబ్బాయి, వైస్‌ ప్రిన్సిపల్‌ రసూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని