logo

భారీ సీతాకోక చిలుక

మారేడుమిల్లి మండలంలోని వాలమూరు వద్ద గల జంగిల్‌స్టార్‌ నేచర్‌క్యాంపు పరిసరాల్లో అరుదైన సీతాకోకచిలుకలు కనువిందు చేస్తున్నాయి.

Published : 26 Nov 2022 02:26 IST

- న్యూస్‌టుడే, మారేడుమిల్లి

మారేడుమిల్లి మండలంలోని వాలమూరు వద్ద గల జంగిల్‌స్టార్‌ నేచర్‌క్యాంపు పరిసరాల్లో అరుదైన సీతాకోకచిలుకలు కనువిందు చేస్తున్నాయి. సాధారణంగా 6 నుంచి 8 సెంటీమీటర్ల వెడల్పుతో ఉంటాయి. అయితే ఇక్కడ సుమారు 14 సెంటీమీటర్ల వెడల్పుతో పసుపు వర్ణంలో, రెక్కలపై నల్లటి మచ్చలతో ఓ సీతాకోకచిలుక సోమవారం కనిపించింది. దీన్ని పలువురు ఆసక్తిగా చూశారు. దీనిపై జంగిల్‌స్టార్‌ నేచర్‌ క్యాంపు సమన్వయకర్త ఆమర్తి వీరబాబు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఈ సీతాకోకచిలుక ఆర్థోపొడా జాతి, లిపిడోప్తెరా తరగతికి చెందిందని తెలిపారు. దట్టమైన అడవులు విస్తరించి ఉన్న చోట్ల ఇవి కనిపిస్తుంటాయని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని