logo

ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు!

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్నారు. దేవీపట్నం మండలంలోని కొండమొదలు నుంచి గంగంపాలెం వరకు 44 గ్రామాలు ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్నాయి.

Published : 03 Dec 2022 00:58 IST

పోలవరం ముంపు గ్రామాల్లో జోరుగా చోరీలు

దేవీపట్నం న్యూస్‌టుడే

స్థానికులు ఎదురుపడటంతో దొంగిలించిన ఇనుప సామగ్రి వదిలివెళ్లిన దొంగలు

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్నారు. దేవీపట్నం మండలంలోని కొండమొదలు నుంచి గంగంపాలెం వరకు 44 గ్రామాలు ప్రాజెక్టుతో ముంపునకు గురవుతున్నాయి. ఇటీవల కొండమొదలు పంచాయతీతోపాటు మంటూరు నుంచి సీతారం వరకు అనేక గ్రామాలను ఖాళీ చేసి నిర్వాసితులు పునరావాస కాలనీలకు చేరుకున్నారు. గ్రామాల్లో ఎవరూ లేకపోవడంతో మైదాన ప్రాంతాల నుంచి కొంతమంది దొంగలు ఇక్కడకు చేరుకుని ప్రభుత్వ భవనాల్లో ఉన్న ఇనుము, దేవాలయాల్లో ఉన్న గంటలు, హుండీలు, ఇళ్లలో ఉన్న కలపను రాత్రికి రాత్రే తరలించేస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో వాటికి అధిక ధర పలకడంతో వేల రూపాయల్లో సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం గోదావరిలో వరద పూర్తిగా తగ్గడంతో గ్రామాలకు రాకపోకలు సాగుతున్నాయి. దీంతో పొలాల్లో ఉన్న టెలిఫోన్‌, ఇనుప స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న రాగి తీగను, తాగునీటి బోర్లలో ఉన్న గొట్టాలు, చిన్నపాటి జనరేటర్లను పోశమ్మగండి మీదుగా మైదాన ప్రాంతానికి తీసుకెళ్లిపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని నిర్వాసితులు కోరుతున్నారు.

ట్రాన్స్‌ఫార్మర్‌లో ఉన్న రాగి తీసేశారిలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని