logo

పొరుగు సేవల ఉద్యోగులను తొలగిస్తే ఊరుకోం

ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

Published : 06 Dec 2022 01:34 IST

శివలింగపురంలో తెదేపా నేతల ప్రదర్శన

అనంతగిరి, న్యూస్‌టుడే: ప్రభుత్వం అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగిస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. చిలకలగెడ్డ, కాశీపట్నం, వెంకయ్యపాలెం, శివలింగపురం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఆయా గ్రామాల్లో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. పదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధపడటం ఎంతవరకు సమంజసమని శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు. ప్రజా సమస్యలు మరిచి తుగ్లక్‌ పాలన సాగిస్తున్న జగన్‌కు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని అన్నారు. కనీసం పేదలకు ఇల్లు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉండటం దారుణమన్నారు. సచివాలయ భవనాలే అనేక చోట్ల అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. తెదేపా వేసిన రోడ్లు తప్ప, వైకాపా ఏ గ్రామానికి రోడ్లేసిన దాఖలాలు లేవని తెలిపారు. నేతలు బుజ్జిబాబు, ఆనంద్‌, అప్పారావు, జోగులు, సత్యనారాయణ, బాకూరు వెంకటరమణ, లక్ష్మణ్‌, నరేంద్ర, పాండురంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని