logo

ఐక్యంగా ఉద్యమించాల్సిందే

తెలుగు రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పునరావాసం, పరిహారం కోసం ఐక్యంగా పోరాడాలని, ఉద్యమించకపోతే తీవ్రంగా నష్టపోతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

Published : 21 Mar 2023 01:20 IST

జన చైతన్య యాత్ర బృందానికి సమస్యలు వివరిస్తున్న సీపీఎం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు

ఎటపాక, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పునరావాసం, పరిహారం కోసం ఐక్యంగా పోరాడాలని, ఉద్యమించకపోతే తీవ్రంగా నష్టపోతామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలు, కేంద్ర ప్రభుత్వ మతోన్మాద వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 17న సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన మోటారు సైకిల్‌ జన చైతన్య యాత్ర సోమవారం ఎటపాక మండలం కన్నాయిగూడెం చేరుకుంది. స్థానిక నాయకులు ఈ బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు ఇసంపల్లి వెంకటేశ్వర్లు విలీన మండలాల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితులపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ఈనెల 29న హైదరాబాద్‌లో భారీ బహిరంగా సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం మేడువాయి, కన్నాయిగూడెం, చింతలగూడెం, రాజుపేట గ్రామాల్లో యాత్ర కొనసాగింది. మాధవరావు, ఆకిశెట్టి రాము, జయమ్మ, ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి పద్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని