logo

మొన్న వైకాపా... నేడు తెదేపా

చోడవరం పట్టణంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ వార్డుల్లో పర్యటిస్తున్నారు.

Published : 28 Mar 2024 02:17 IST

కోటేశ్వరరావు, ఆయన తల్లితో ధర్మశ్రీ

కోటేశ్వరరావుకు తెదేపా కండువా కప్పుతున్న రాజు

చోడవరం, న్యూస్‌టుడే: చోడవరం పట్టణంలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు, వైకాపా అభ్యర్థి ధర్మశ్రీ వార్డుల్లో పర్యటిస్తున్నారు. తటస్థులుగా ఉన్నవారిని స్వయంగా కలిసి తమకు మద్దతు తెలపాలని కోరుతున్నారు. గోవాడ చక్కెర కర్మాగారం మాజీ ఛైర్మన్‌, చోడవరం మాజీ సర్పంచి దివంగత సకురు పెంటారావు పట్టణవాసులకు సుపరిచితులు. ఆయన కుమారుడు కోటేశ్వరరావు సామాజిక కార్యకర్త. 2019 ఎన్నికల్లో ఈయన వైకాపా ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల తర్వాత పెంటారావు కుటుంబాన్ని అధికార పార్టీ పక్కన పెట్టింది. మళ్లీ ఎన్నికలు రావడంతో వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ రెండు రోజుల కింద కోటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన భార్య, కుమారుడితో కలిసి ముచ్చటించారు. ఆ వెంటనే తెదేపా అభ్యర్థి కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు ఆయన ఇంటికి వెళ్లారు. తనకు రాజకీయ గురువైన పెంటారావు కుటుంబం మద్దతు ఇవ్వాలని అభ్యర్థించి కుటుంబ సభ్యులను ఒప్పించారు. దీంతో బుధవారం జరిగిన పార్టీ కార్యక్రమంలో కోటేశ్వరరావుకు పార్టీ కండువా కప్పి తెదేపా తీర్థం పుచ్చుకున్నట్లు ప్రకటించారు. బుధవారం పట్టణంలో వెలమవీధికి చెందిన 12 కుటుంబాలు గూనూరు అచ్చిబాబు నేతృత్వంలో తెదేపాలో చేరాయి. ఈ కార్యక్రమంలో గూనూరు మల్లునాయుడు, దేవరపల్లి వెంకట అప్పారావు, రొంగిలి సోమునాయుడు, అప్పలరాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని