logo

‘ఆధారాలు లేకుండా సరెండర్‌ చేస్తారా?’

విధినిర్వహణలో ఎంతో శ్రమించి ఉద్యోగాలు చేస్తున్న తమను ఏపీఎంలు ఎటువంటి ఆధారాలు లేకుండా రంపచోడవరం వెలుగు ఏపీడీ కార్యాలయానికి సరెండర్‌

Published : 28 Mar 2024 02:20 IST

ఆవేదన వ్యక్తం చేస్తున్న వెలుగు సీసీలు

రంపచోడవరం, న్యూస్‌టుడే: విధినిర్వహణలో ఎంతో శ్రమించి ఉద్యోగాలు చేస్తున్న తమను ఏపీఎంలు ఎటువంటి ఆధారాలు లేకుండా రంపచోడవరం వెలుగు ఏపీడీ కార్యాలయానికి సరెండర్‌ చేయడం దారుణమని వెలుగు సీసీలు లింగమ్మ, చిలకమ్మ, హేమలత, శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తమకు జరిగిన అన్యాయంపై రంపచోడవరంలో వారు విలేకరులతో మాట్లాడారు. డివిజన్‌ ఏడు మండలాల్లో 39 మంది మండల సమాఖ్య సీసీలుగా పని చేస్తున్నామన్నారు. దేవీపట్నం, అడ్డతీగల మండలాల్లో పని చేస్తున్న ఏపీఎంలు ఎటువంటి ఆధారాలు చూపించకుండా తమను సరెండర్‌ చేయించడం అన్యాయమని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై రంపచోడవరం వెలుగు ఏపీడీ శ్రీనివాసరావును, హెచ్‌ఆర్‌ రాధా అపర్ణను ప్రశ్నించగా, ఈ నెల 15న విధుల్లో తీసుకొంటామని చెప్పారని తెలిపారు. ఇప్పటివరకు తమను విధుల్లోకి తీసుకోలేదని వాపోయారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని