logo

పేటలో అధికం.. మాడుగులలో అత్యల్పం

జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం ఓటర్ల పరంగా అగ్రస్థానంలో నిలుస్తోంది.

Published : 28 Mar 2024 02:27 IST

పాడేరు, నక్కపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో పాయకరావుపేట నియోజకవర్గం ఓటర్ల పరంగా అగ్రస్థానంలో నిలుస్తోంది. దీనికి దరిదాపుల్లో ఏ నియోజకవర్గం లేదు. ఉమ్మడి జిల్లా భౌగోళికంగా మూడు విభిన్న ప్రాంతాలు కలిసి ఉండేది. ఇందులో కొంత మన్యం, మరికొంత మైదానం కాగా, మిగిలింది తీరప్రాంతాల సమూహం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని గ్రామీణ విశాఖ పరిధిలో అనకాపల్లి, మన్యం కలిసి ఉండేది. అప్పట్లో ఎనిమిది నియోజకవర్గాలు ఉండగా, జిల్లాల విభజన తర్వాత పాడేరు, అరకు నియోజకవర్గాలు మన్యం జిల్లాలో ఉన్నాయి. పాయకరావుపేట, అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మాడుగుల నియోజవర్గాల్లో ఓటర్లలో పేటలో అధిక సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా గత ప్రభుత్వాల హయాంలోనే ఇక్కడ రెండు పరిశ్రమలు ఏర్పాటు కావడంతో ఇతర ప్రాంతాలవారు వలస వచ్చి స్థిరపడ్డారు. దీనికి తోడు మత్స్యకార ప్రాంతాలు అధికంగా ఉండటంతో జనాభా సంఖ్య ఎక్కువే. చివరి స్థానంలో మాడుగుల ఉంది. ప్రస్తుతం ఉన్న ఓటర్లలోనూ యువతే అధికంగా ఉన్నారు. ఓటర్ల నమోదుకు గడువు ఉండటంతో ప్రస్తుతం నూతన ఓటర్ల నమోదు జరుగుతోంది.

జిల్లాలో అర్హత కలిగిన వారంతా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇదంతా పూర్తయితే ప్రస్తుతం ఉన్న సంఖ్యకంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ఇందులోనూ ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల విజయావకాశాలపై యువత ప్రభావం చూపనున్నారు. చదువుకున్న వారిలో చాలామంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారంతా తమకు ఎవరు భరోసా ఇస్తారని భావిస్తారో వారికే పట్టం కట్టే అవకాశం కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని