logo

సీఎంఏ ఫలితాల్లో విద్యార్థుల సత్తా

ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం ప్రకటించిన సీఎంఏ ఫైనల్‌, సీఎంఏ ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో.

Published : 25 Mar 2023 04:14 IST

విద్యార్థులతో నందకిషోర్‌, శ్రీలక్ష్మి

గుంటూరు విద్య, న్యూస్‌టుడే: ది ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా బుధవారం ప్రకటించిన సీఎంఏ ఫైనల్‌, సీఎంఏ ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి మంచి ర్యాంకులు సాధించారని శ్రీమేధ సంస్థ ఛైర్మన్‌ అన్నా నందకిషోర్‌ తెలిపారు. శుక్రవారం బ్రాడీపేట సంస్థ క్యాంపస్‌లో సత్తాచాటిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. సీఎంఏ ఫైనల్‌లో అఖిలభారత స్థాయిలో సి.లక్ష్మీకాంత్‌ 14వ ర్యాంకు, ఎం.అంజలి 49వ ర్యాంకు సాధించినట్లు తెలిపారు. సీఎంఏ ఇంటర్‌ ఫలితాల్లో ఆలిండియా స్థాయిలో 7 ర్యాంకులు వచ్చాయన్నారు. సీఎంఏ ఇంటర్‌లో ఎస్‌.శివారెడ్డి 3, టి.రోహిత్‌ 22, పి.మణికంఠలక్ష్మి 24, పి.లోకేష్‌ 39, ఎ.వెంకటసాయివర్షిత్‌ 40, కెవీఎల్‌ ప్రత్యూష 45, ఎం.సువర్చలాదేవి 47 ర్యాంకులు సాధించినట్లు వెల్లడించారు. సబ్జెక్టుల వారీగానూ అత్యుత్తమ మార్కులు వచ్చాయన్నారు. సీఎంఏ ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులకు 27 నుంచి ఫైనల్‌, సీఎంఏ ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించని వారికీ అదే రోజు తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఛైర్మన్‌ అన్నా నందకిషోర్‌, సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ అన్నా శ్రీలక్ష్మి జ్ఞాపికలు అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని