logo

‘బుద్ధప్రసాద్‌కే మా మద్దతు’

తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు.

Published : 26 Apr 2024 04:41 IST

మండలిని సత్కరిస్తున్న బీసీ సంఘాలు

అవనిగడ్డ, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. బుద్ధప్రసాద్‌ కుటుంబానికి ఎంతో ఘనమైన రాజకీయ చరిత్ర ఉందని, ఆయన అయితేనే బీసీలకు సరైన ప్రాధాన్యత లభిస్తుందని శంకర్రావు చెప్పారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్‌ను ఆయన ఘనంగా సత్కరించారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు అందె జగదీష్‌, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల అధ్యక్షుడు గుడివాక శేషుబాబుతో పాటు పలువురు బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని