logo

తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం

అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది.

Published : 26 Apr 2024 04:24 IST

కొత్తగా దారి వేయాలని యత్నిస్తున్న వెంకటేశ్వరరావు స్థలం

అవనిగడ్డ, న్యూస్‌టుడే: అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. ఆ స్థలంలో నివాసంతోపాటు, ఎడ్ల పాక కూడా ఉండేది. ఇటీవల పంచాయతీ, రెవెన్యూ అధికారులు ఆ స్థలం ప్రభుత్వ పోరంబోకు అని స్వాధీనం చేసుకోవాలని.. అందులో ఉన్న మరుగుదొడ్లు, బాతురూమ్‌లు, తదితరాలు తొలగించారు. దీంతో వెంకటేశ్వరరావు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. దశాబ్దాలుగా ఆ స్థలం పక్కన ఉన్న రహదారికి బాదులు పాతి, రహదారిని మూసివేశారు. అయితే వెంకటేశ్వరరావు స్థలం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో పంచాయతీ అదికారులు ఉన్నదారిని మూసివేయించారని పలువురు భావిస్తున్నారు. ఉన్న దారిని పూడ్చి, వెంకటేశ్వరరావు స్వాధీనంలో ఉన్న స్థలం నుంచి దిగువున ఉన్న ఉరక రేవులోని వారికి రాకపోకలకు కొత్త దారిని ఏర్పాటు చేయడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా ఇప్పటికీ ఆ రహదారిని తిరిగి పునరుద్ధరించక పోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని