logo

సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ

ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌గా పి.హెచ్‌.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

Published : 26 Apr 2024 04:42 IST

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌గా పి.హెచ్‌.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామకృష్ణను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. బుధవారం ఆయన విజయవాడకు విచ్చేశారు. కార్యాలయంలో సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. అనంతరం డీజీపీ కె.వి.రాజేంద్రనాథరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు కె.శ్రీనివాసరావు, అధిరాజ్‌సింగ్‌ రాణా, ఉదయరాణి, టి.హరికృష్ణ, కె.చక్రవర్తి, బి.రామకృష్ణ, ఏడీసీపీలు టి.కనకరాజు, కృష్ణమూర్తినాయుడు, శ్రీహరిబాబు, డి.ప్రసాద్‌ ఏసీపీలు, సీఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని