logo
Published : 27 Nov 2021 04:13 IST

20.573 కిలోల దుర్గగుడి బంగారం డిపాజిట్‌

బ్యాంకు అధికారులకు ఆభరణాలు అప్పగిస్తున్న  ఛైర్మన్‌ సోమినాయుడు, ఈఓ భ్రమరాంబ తదితరులు

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే : దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న 20.573 కిలోల బంగారాన్ని ఎస్‌బీఐ గోల్డ్‌ బాండ్‌ పథకం కింద శుక్రవారం డిపాజిట్‌ చేశారు. గత రెండు రోజులుగా స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలను రిజిస్టరు ఆధారంగా దేవాదాయ శాఖ జ్యుయలరీ వెరిఫికేషన్‌ అధికారి ప్రసాద్‌ పరిశీలించారు. గోల్డ్‌ బాండ్‌ పథకంలో ఆభరణాలను అప్పగించడంతో దేవస్థానానికి బ్యాంకు వడ్డీ చెల్లిస్తుందని అధికారులు తెలిపారు. అవసరమైనప్పుడు 24 క్యారెట్ల బంగారాన్ని అప్పగిస్తారని పేర్కొన్నారు. ఆలయ ఈఓ భ్రమరాంబ, పాలక మండలి ఛైర్మన్‌ సోమినాయుడు, ఆర్జేసీ సురేష్‌బాబు, ఏఈఓ వెంకటరెడ్డి, అప్రైజర్‌ షమ్మి, పాలకమండలి సభ్యురాలు సుజాత పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని