CM Jagan: పీఆర్సీ అప్‌డేట్‌.. ఆర్థికశాఖ అధికారులతో జగన్‌ సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశంపై చర్చించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం

Published : 09 Dec 2021 15:00 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ) అంశంపై చర్చించేందుకు ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్‌ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఉద్యోగుల వేతన సవరణపై కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎం చర్చించారు. కమిటీ సిఫార్సులను పరిశీలించి ఎంత మేర వేతనాలు పెంచాలనే అంశంపై అధికారుల అభిప్రాయాలను ఆయన అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. 

సీపీఎస్‌ రద్దు, గ్రామవార్డు సచివాలయ సిబ్బంది సర్వీసులను పర్మినెంట్‌ చేయడం.. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ తదితర డిమాండ్లను సైతం పరిష్కరిస్తే బడ్జెట్‌పై ఎంత భారం పడుతుందనే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ఈనెల 3న సీఎం జగన్‌ తిరుపతిలో ఉద్యోగులకు హామీ ఇచ్చారు. మరోవైపు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని