logo

పాఠశాలల విలీనంపై ఉద్యమిస్తాం

ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనంపై ఉద్యమిస్తామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్‌ జిల్లాశాఖ సమావేశం శనివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో జరిగింది. ఆయన మాట్లాడుతూ 3,4,5 తరగతులను

Published : 22 May 2022 04:33 IST


ప్రసంగిస్తున్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు

అనంతపురం విద్య, న్యూస్‌టుడే: ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో విలీనంపై ఉద్యమిస్తామని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్‌ జిల్లాశాఖ సమావేశం శనివారం స్థానిక ఉపాధ్యాయ భవన్‌లో జరిగింది. ఆయన మాట్లాడుతూ 3,4,5 తరగతులను ఒక కిలోమీటరు పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ తరువాత 3 కి.మీ పరిధిలోని పాఠశాలల్లో విలీనం చేయడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల బడుగు, బలహీన వర్గాల పిల్లలు బడికి దూరమవుతారన్నారు. ప్రభుత్వం స్పందించి విలీనం విరమించుకోవాలన్నారు. లేని పక్షంలో జూన్‌ నుంచి దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ జగన్‌ అధికారం చేపట్టిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకూ అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి సిరాజుద్దీన్‌, మాధవ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని