logo

సిఫార్సు లేఖలు చెల్లలే..!

అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల సంక్షేమ అధికారులకు మంగళవారం సంక్షేమ భవనంలో ఆయా శాఖల సాధికారత అధికారులు విశ్వమోహన్‌రెడ్డి, కుష్బు కొఠారి, అన్నాదొర ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ నిర్వహించారు.

Published : 29 Jun 2022 05:32 IST

93 మంది వసతి గృహ సంక్షేమ అధికారులకు స్థానచలనం

బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న సంక్షేమ శాఖల సాధికారత అధికారులు విశ్వమోహన్‌రెడ్డి,

కుష్బూ కొఠారి, అన్నాదొర

అనంత సంక్షేమం, న్యూస్‌టుడే: అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల సంక్షేమ అధికారులకు మంగళవారం సంక్షేమ భవనంలో ఆయా శాఖల సాధికారత అధికారులు విశ్వమోహన్‌రెడ్డి, కుష్బు కొఠారి, అన్నాదొర ఆధ్వర్యంలో బదిలీల ప్రక్రియ నిర్వహించారు. మొత్తం 93 మంది వసతి గృహ సంక్షేమ అధికారులకు స్థానచలనం కలిగింది. మరో 22 మందిని విజ్ఞప్తి మేరకు బదిలీ చేశారు. మూడు శాఖల పరిధిలో ఏకంగా 60 మంది వరకు సిఫార్సు లేఖలను అధికారులకు అందించారు. బదిలీలు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నిర్వహించాలని, లేనిపక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహించిన అధికారులపై చర్యలు తప్పవని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు హెచ్చరించారు. దీంతో సిఫార్సు లేఖలన్నీ పక్కన పెట్టేశారు. స్పౌజ్‌, వికలాంగ, సీనియార్టీ ప్రాతిపదికన బదిలీల ప్రక్రియ నిర్వహించారు.

వెనక్కి తగ్గిన స్పౌజ్‌ కేటగిరీ

స్పౌజ్‌ (భార్య, భర్తలు ఉద్యోగులు) కేటగిరి అభ్యర్థులు ఇప్పటికే స్పౌజ్‌ వాడుకున్నా మళ్లీ వాడుకోవాలని ప్రయత్నించి ఆఖరి నిమిషంలో తప్పుకొన్నారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా 2014 తర్వాత స్పౌజ్‌ వాడుకొని ఉంటే అనర్హులని, ఒకవేళ ఉపయోగించుకుంటే విచారణలో తేలితే క్రిమినల్‌ కేసులు ఉంటాయని ఆ మేరకు అంగీకార పత్రాన్ని భార్యాభర్తలు ఇద్దరూ అందివ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో చాలా మంది అడ్డ దారిలో చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ముందుగా ఉపయోగించుకోవాలని నిర్ణయించినా కౌన్సెలింగ్‌ సమయంలో ఆ కేటగిరిని ఉపయోగించుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని