logo

ఎంపీ మాధవ్‌ను సాంఘిక బహిష్కరణ చేయాలి

సభ్య సమాజం తలదించుకునేలా న్యూడ్‌ వీడియో కాల్‌ ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సాంఘిక బహిష్కరణ చేయాలని సీపీఐ, సీపీఎం, అనుబంధ సంఘాలైన ఏపీ మహిళా సమాఖ్య, అఖిల భారత ప్రజాతంత్ర మహిళ

Published : 17 Aug 2022 03:54 IST

మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్‌

మారుతీనగర్‌, న్యూస్‌టుడే: సభ్య సమాజం తలదించుకునేలా న్యూడ్‌ వీడియో కాల్‌ ద్వారా అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ను సాంఘిక బహిష్కరణ చేయాలని సీపీఐ, సీపీఎం, అనుబంధ సంఘాలైన ఏపీ మహిళా సమాఖ్య, అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం నాయకురాళ్లు డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రభుత్వ పెన్షనర్ల భవన్‌లో వివిధ రాజకీయ పార్టీల నేతలతో చర్చా వేదిక నిర్వహించారు. మహిళ సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మావతి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్‌, జిల్లా కార్యదర్శి జాఫర్‌, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, తెదేపా ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సాలార్‌బాషా, కురుబ సంఘం మహిళా నాయకురాలు శివబాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీష్‌ మాట్లాడుతూ ఎంపీపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం మందలింపు చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. వీడియో మార్ఫింగ్‌ జరగలేదని అమెరికన్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక ఇచ్చినా జిల్లా పోలీసులు ఎందుకు స్పందిచడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని