logo

ప్రతి కుటుంబానికి ఆర్థికంగా లబ్ధి: మంత్రి

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం పని చేస్తున్నారని, ప్రతి కుటుంబానికి బటన్‌ నొక్కి ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 04:42 IST

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆంజనేయస్వామి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి, చిత్రంలో మంత్రి గుమ్మనూరు జయరాం తదితరులు

గుంతకల్లు పట్టణం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేదల కోసం పని చేస్తున్నారని, ప్రతి కుటుంబానికి బటన్‌ నొక్కి ఆర్థికంగా లబ్ధి చేకూరుస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. గుంతకల్లు పట్టణ సమీపంలోని కొనకొండ్ల రోడ్డులో సోమవారం భీమా పార్కు, మాజీ ఎమ్మెల్యే ఎల్లారెడ్డి భీమరెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి భీమా పార్కును ప్రారంభించి వెళ్లిపోయారు. అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డితోపాటు కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం విగ్రహావిష్కరణ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి కార్యక్రమాన్ని కొనసాగించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మాట్లాడుతూ ఎల్లారెడ్డి భీమరెడ్డి కుటుంబంలో ముగ్గురు కుమారులు ఎమ్మెల్యేలు, ఒకరు ఎమ్మెల్సీ కావడం విశేషమని చెప్పారు. చంద్రబాబునాయుడు హయాంలో జన్మభూమి కమిటీలు ఉండేవి, వారు చెప్పిన వారికే పింఛన్లు వచ్చేవి, జగన్‌ ప్రభుత్వం వచ్చాక లంచాలకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. కార్మిక శాఖ మంత్రి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అన్నీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం పామిడి, గుంతకల్లు, గుత్తి మండలాలకు చెందిన లబ్ధిదారులకు రెవెన్యూ డివిజన్‌ అధికారి రవీంద్ర మంత్రి చేతుల మీదుగా డిపట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ గిరిజమ్మ, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే సాయిప్రతాప్‌రెడ్డి, భీమరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కోటంరెడ్డి పార్టీని వీడేందుకే  ఫోన్‌ ట్యాపింగ్‌ సాకులు

పెద్దవడుగూరు: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైకాపాను వీడేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ సాకులు అనే ఆయుధాన్ని ఎంచుకున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పార్టీలో ఇమడలేక ఆయన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి సోమవారం పెద్దవడుగూరు మండలంలో చేస్తున్న పాదయాత్రలో మంత్రి పాల్గొని సంఘీభావం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని