logo

ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ ఆదర్శంగా నిలవాలి

పథకాల అమలులో జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Published : 26 Mar 2023 03:09 IST

పుట్టపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే : పథకాల అమలులో జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా పీడీ కార్యాలయంలో జిల్లాలోని 32 మండలాలు, 12 ప్రాజెక్టుల పరిధిలోని సీడీపీవోలు, సూపర్‌వైజర్లు, బీపీసీ, బీపీఏలతో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాతాశిశు మరణాలు, సంక్షేమ పథకాలు, ప్రాజెక్టు పరిధిలో కార్యక్రమాల అమలు, కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతల హాజరు మెరుగు, పోషకాహార వినియోగం, చిన్నారుల ఆరోగ్యం తదితర అంశాల ప్రగతి సాధనలో శ్రీసత్యసాయి జిల్లా ముందుండేలా చూడాలని, అందుకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. పీడీ లక్ష్మికుమారి, కార్యాలయ సూపరిండెంట్‌ ఉమామహేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని