logo

ఇంకుడు గుంతలతో భూగర్భజలం పెంపు

రైతులు పొలాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదని కేంద్ర జల శక్తి అభియాన్‌ నోడల్‌ ఆఫీసర్‌ తనూజాఠాగూర్‌ పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 03:14 IST

ధర్మవరం : బుడ్డారెడ్డిపల్లిలో అమృత్‌ సరోవర్‌ పనులను పరిశీలిస్తున్న   నోడల్‌ అధికారి తనూజాఠాగూర్‌, కలెక్టర్‌ అరుణ్‌బాబు, తదితరులు

ధర్మవరం, న్యూస్‌టుడే : రైతులు పొలాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుంటే భవిష్యత్తులో నీటి సమస్య ఉండదని కేంద్ర జల శక్తి అభియాన్‌ నోడల్‌ ఆఫీసర్‌ తనూజాఠాగూర్‌ పేర్కొన్నారు. శుక్రవారం ధర్మవరం మండలం బుడ్డారెడ్డిపల్లిలో వాటర్‌ షెడ్‌ పథకం కింద చేపట్టిన అమృత్‌ సరోవర్‌ పనులను జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబుతో కలసి ఆమె పరిశీలించి రైతులతో మాట్లాడారు. రెండు కుంటలకు సంబంధించి రూ.18 లక్షలతో నిర్మిస్తున్న పనులను తనిఖీ చేశారు. ఇంకుడు గుంతలను మరింత విస్తరింపజేసి అధికంగా నీటి నిల్వ చేసుకుంటే వరిపంట సాగు చేసుకోవచ్చని రైతులకు ఆమె తెలిపారు. పొలాల్లో ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో పీఆర్‌అండ్‌ఆర్డీ డైరెక్టర్‌ చిన్నతాతయ్య, జాయింట్‌ కమిషనర్‌ రూరల్‌ విభాగం శివప్రసాద్‌, డ్వామా పీడీ రామాంజనేయులు, ఆరీజో తిప్పేనాయక్‌, అసిస్టెంట్‌ పీడీ సుధాకర్‌రెడ్డి, ఎంపీడీఓ మమతాదేవి, ఏపీడీ చలపతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని